అంతర్జాతీయం (International) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఇరీడియం.. బంగారం, ప్లాటినం కంటే ఎందుకు విలువైనది ?

ఇరీడియం అనేది విమానం ఇంజన్లు, కారు కాటలిస్టులు, నీటి లోపల వేసే పైపుల తయారీకి అత్యంత అవసరం. ఇంకా స్పార్క్ ప్లగ్గులు, మెడికల్, ఎలక్ట్రానిక్ పరికరాల్లో కూడా దీన్ని వాడతారు. చివరికి గడియారాలు, దిక్సూచిల్లో కూడా స్వల్ప మోతాదులో ఇరీడియం ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇరీడియం వార్తల్లోకి రావడానికి కారణం ఏంటంటే.. దాని ధర! ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇరీడియం ధర 131 శాతం పెరిగింది. ఒక ఔన్స్ ఇరీడియం ధర దాదాపు 4 లక్షల 40 వేలు రూపాయలు. ఒక ఔన్స్ అంటే 28.3495 గ్రాములు, ఒక గ్రాము ఇరీడియం ధర 15,520 రూపాయలు. గ్రాము బంగారం ధర 4450 రూపాయలు ఉండగా, ప్లాటినం ధర ఒక గ్రాము దాదాపు 3800 రూపాయలుగా ఉంది. బంగారం, ప్లాటినం కంటే ఇరీడియం ధర మూడింతల కంటే ఎక్కువ. ఇది పెద్దగా తుప్పు పట్టదు, ఎంత వేడినైనా తట్టుకుంటుంది, అత్యంత అరుదుగా దొరుకుతుంది, పైగా దీనికి డిమాండ్ ఎక్కువ, ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే పరికరాల్లో దీని వినియోగం పెరగడం వంటి పలు కారణాలు ఇరీడియం ధర పెరుగుదలకు కారణంగా చెప్తున్నారు. ఇంకా ప్లాటినం, పల్లాడియం మైనింగ్‌లో ఇది ఉప ఉత్పత్తిగా లభిస్తుంది. సరఫరా తక్కువగా ఉండటంతో ఇదిప్పుడు మరింత విలువైన లోహంగా మారింది. శిలాజ ఇంధనాల స్థానంలో క్లీన్ ఎనర్జీ ఉత్పత్తికి హైడ్రోజన్‌ కీలకంగా మారుతోంది.

ప్రపంచ ఇరీడియం ఉత్పత్తిలో 80 నుంచి 85 శాతం దక్షిణాఫ్రికా నుంచే వస్తుంది.
ఇరీడియాన్ని సాధారణంగా స్పార్క్ ప్లగ్గుల్లో ఎక్కువగా వాడుతుంటారు. కానీ ఇతర పరిశ్రమల్లో కూడా దీనికి డిమాండ్ పెరుగుతోంది. ఇది చాలా చిన్న మార్కెట్. అందుకే ఇరీడియం సరఫరాలో ఏ చిన్న అంతరాయం కలిగిన దానిధరపై చాలాపెద్ద ప్రభావం కనిపిస్తుంది. కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే ఇరీడియం కొంటూ, అమ్ముతూ ఉంటాయి. ఇరీడియం వెండిలా తెల్లగా కొద్దిగా పసుపు రంగులో ఉంటుంది.

దీన్ని గ్రహాంతర లోహంగా భావిస్తారు. ఎందుకంటే ఉల్కల్లో ఇది పుష్కలంగా ఉంటుంది. భూమిపై ఉపరితలంలో ఇది దొరకడం చాలా అరుదు. ఇరీడియాన్ని 1803లో కనిపెట్టారు. సహజ ప్లాటినం ముడి లోహంలో దీన్ని గుర్తించారు. ఇది భూమిపై అత్యంత అరుదుగా లభించే లోహం. సంవత్సరానికి దాదాపు మూడు టన్నుల ఇరీడియం మాత్రమే వెలికితీస్తారు. ఎలక్ట్రానిక్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో సింథటిక్ క్రిస్టల్స్ పెరగడానికి ఉష్ణోగ్రతను నిరోధించే క్రూసిబుల్స్‌ వాడతారు. వాటిలో ఇరీడియాన్ని తక్కువ పరిమాణంలో ఉపయోగించినా కానీ ఇది చాలా అత్యంత అవసరం. ఇక డిమాండ్ పరంగా చూస్తే గతేడాది ఎలక్ట్రిసిటీ రంగం నుంచి 31శాతం, ఎలక్ట్రో కెమికల్ రంగం నుంచి 26శాతం, ఆటోమోటివ్ రంగం నుంచి 13శాతం, మిగిలింది ఇతర పరిశ్రమల నుంచి వచ్చిందని, 5జీ స్మార్టు ఫోన్ల అభివృద్ధి, OLED తెరలుండే పరికరాల తయారీతో ఇరీడియానికి డిమాండ్ మరింత పెరగొచ్చని చెబుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.