తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఓ వెంచర్ విషయంలో ఒక రియల్టర్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ వసూలుకు సంబంధించిన ఆడియో టేప్ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. వెంచర్ వేసినందుకు తనకు మామూలు ఎందుకు ఇవ్వలేదంటూ మంత్రి ప్రశ్నించడంతో తాను సర్పంచ్‌కు మామూలు ఇచ్చానని చెప్పాడు రియల్టర్. సర్పంచ్‌కు ఇస్తే సరిపోదని తనకు, ఎమ్మెల్యేకు మామూలు ఇవ్వాల్సిందేనని అప్పటి వరకు వెంచర్ అపేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి.