బీజాపూర్-సుకుమా జిల్లాల సరిహద్దు అటవీప్రాంతంలో ఈనెల 3వ తేదీ రాత్రి సైనికులకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయనే సంగతి పాఠకులకు విదితమే! ఈ ఘటనలో 23 మంది సైనికులు మృతిచెందగా మావోయిస్టుల్లోనూ భారీగానే ప్రాణనష్టం జరిగిందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అయితే కేవలం నలుగురు మాత్రమే ప్రాణాలు కోల్పోయినట్లు మావోయిస్టులు ప్రకటించారు. ఈ ఘటనలో కోబ్రా యూనిట్‌కు చెందిన రాకేశ్‌సింగ్ అనే కమాండో కనిపించకుండాపోవడంతో ఆ జవాను తమ చెరలో ఉన్నట్లు, సురక్షితంగానే ఉన్నట్లు నక్సలైట్లు వెల్లడించారు. ఇప్పుడు కోబ్రా కమాండో రాకేశ్ ఫొటోను నక్సల్స్ విడుదల చేశారు. అడవిలో తాటాకులతో వేసిన చిన్న గుడిసెలో, కింద ప్లాస్టిక్ కవర్‌పై రాకేశ్‌సింగ్ కూర్చొని ఉన్న ఫొటోని విడుదల చేసింది.
రాకేష్ సింగ్ ఫోటో పంపిన మావోయిస్టులు
