క్రైమ్ (Crime) వార్తలు (News)

మహమ్మద్‌ పర్వేజ్‌ మజ్లిస్ రేవ్‌పార్టీ..

పాతబస్తీ ఉందాహిల్స్‌లో ఫిబ్రవరి 13న జరిగిన ఓ రేవ్‌పార్టీలో మజ్లిస్‌ పార్టీకి చెందిన నేతలు యువతులు, హిజ్రాలతో చిందులు వేయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో 12 మందిపై చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

‌మజ్లిస్‌ పార్టీలో క్రియాశీల నేతగా ఉన్న మహమ్మద్‌ పర్వేజ్ పాతబస్తీ బండ్లగూడలో నివసించేవారు. బండ్లగూడ గౌస్‌నగర్‌ ఉందాహిల్స్‌ చెరువు సమీపంలో నూతనంగా ఓ ఫాంహౌస్‌ నిర్మించి ఫిబ్రవరి 13న ఆ ఫాంహౌస్‌ ప్రారంభోత్సవం సందర్భంగా రేవ్‌పార్టీ ఏర్పాటు చేశాడు. దీనికి మజ్లిస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు, పర్వేజ్‌ స్నేహితులు హాజరయ్యారు. పర్వేజ్‌ సహా మిగతా వారందరూ మద్యంతాగి వారితో చిందులు వేసినట్లుగా వీడియోలో కనిపిస్తోంది. వారితో యువతులు అశ్లీల నృత్యాలు చేసినట్లుగానూ ఉంది. పర్వేజ్‌తో సహా 12 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.