ఏపీలో పరిషత్‌ ఎన్నికలపై ఉన్న అనుమానాలకు తెరపడింది. రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది. మరియు ఎన్నికలు యథాతథంగా నిర్వహించవచ్చని అనుమతించింది. కానీ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఫలితాలను ప్రకటించవద్దని ఎస్‌ఈసీని హైకోర్టు ఆదేశించింది.