వార్తలు (News)

నేటి నుంచి బెంగళూరులో 144 సెక్షన్

కరోనా వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం వైరస్‌ కట్టడి కోసం మరిన్ని కఠిన నిర్ణయాలను అమలుచేస్తున్నట్టు ప్రకటించింది. బెంగళూరు నగర పరిధిలో నేటి నుంచి 144 సెక్షన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు అపార్ట్‌మెంట్లు, నివాస సముదాయాల్లోని ఈత కొలనులు, జిమ్‌లు, పార్టీ హాళ్లను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

కర్ణాటక లో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 6150 కొత్త కేసులు నమోదు కాగా, ఒక్క బెంగళూరులోనే 4266 కేసులు ఉండటమే కాకుండా 39మంది మరణాల్లో 26 మరణాలు నగరంలోనే కావడం అక్కడి పరిస్థితి ఉద్ధృతికి అద్దంపడుతుతోంది. ప్రస్తుతం అక్కడ 45,107 క్రియాశీల కేసులు ఉన్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.