వార్తలు (News)

పది రోజుల లాక్ డౌన్ లో రాయ్‌పూర్

దేశంలో కరోనా ఉద్ధృతి రోజురోజుకీ పెరుగుతుండడంతో వైరస్‌ను కట్టడి చేయడమే లక్ష్యంగా పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు ఆంక్షలు అమలుచేస్తున్న ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం తాజాగా రాష్ట్ర రాజధాని నగరం రాయ్‌పూర్‌లో ఏప్రిల్‌ 9 నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. ఒక్క రాయ్‌పూర్‌లోనే ప్రస్తుతం 13,107 క్రియాశీల కేసులు ఉండడంతో మరణాలు పెరగడంపై ఆందోళన వ్యక్తంచేసిన సీఎం భూపేశ్‌ బఘెల్‌ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.