జాతీయం (National) వార్తలు (News)

నేడు ఆద్యంతం లాభాల్లో సెన్సెక్స్

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఉదయం సానుకూలంగా ప్రారంభమై ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల ప్రకటన తర్వాత ఇంట్రాడే గరిష్ఠాలకు చేరుకోవడం శుభసూచకం. ఉదయం సెన్సెక్స్‌ 49,277 వద్ద లాభాల్లో ప్రారంభమైఆ తర్వాత ఒక్కసారిగా పైకి ఎగిసి 49,900 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరకు 460 పాయింట్ల లాభంతో 49,661 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ ఉదయం 14,716 వద్ద ప్రారంభమై 14,879 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరకు 135 పాయింట్లు ఎగబాకి 14,819 వద్ద స్థిరపడింది.

ఒక్క ఇంధనం మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో పయనించాయి. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, విప్రో లిమిటెడ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎస్‌బీఐ, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. యూపీఎల్‌, అదానీ పోర్ట్స్‌, ఎన్‌టీపీసీ, టాటా కన్సూమర్‌ ప్రోడక్ట్స్‌, టైటాన్‌ కంపెనీ షేర్లు నష్టాల్ని చవిచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.