వంద రోజులకు పైగా పోలీసులను పరుగులు పెట్టించిన క్షుద్ర పూజల కోసం ఒక మైనర్‌ బాలికను పూజారి కిడ్నాప్‌ చేసిన కేసు చివరికి ఒక కొలిక్కి రావడంతో పోలీసులు ఊపిరి తీసుకున్నారు. మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసిన పూజారి ఆమెను ఉత్తరప్రదేశ్‌కు తరలించి అక్కడే ఆమెను బందీగా ఉంచాడు.

ఎట్టకేలకు మైనర్‌ బాలికతో సహా, ప్రధాన సూత్రధారి, పాత్రధారి అయిన పూజారి సూర్యప్రకాష్‌శర్మను పోలీసులు అదుపులోకి తీసుకుని మైనర్‌ బాలిక వెల్లంకి రాజశ్రీ ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. అసలు ఎందుకు కిడ్నాప్‌ చేశాడు? ఉత్తరప్రదేశ్‌ దాకా ఎందుకు తీసుకెళ్లాడు? ఇన్నాళ్లూ అక్కడేం చేశాడు? ఈ వ్యవహారంలో ఇంకెవరెవరి పాత్ర ఉంది? దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.ఎర్రుపాలెం ఎస్సై ఉదయ్‌కిరణ్‌ ఈ కేసును సవాల్‌గా తీసుకుని మైనర్‌ బాలికను కిడ్పాపర్‌ చెర నుంచి విడిపించడంతో ఉదయ్‌కిరణ్‌పై ప్రసంశల జల్లు కురుస్తోంది.