వార్తలు (News)

సర్వదర్శన టోకెన్లపై తితిదే కీలక నిర్ణయం

కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా తితిదే ఈనెల 12 నుంచి శ్రీవారి టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు బుధవారం సాయంత్రం తితిదే ఓ ప్రకటన విడుదల చేసింది. భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా సర్వదర్శన టైమ్ స్లాట్ టోకెన్లను ఈనెల 11వ తేదీ సాయంత్రం వరకు మాత్రమే జారీ చేస్తామని, 12వ తేదీ నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. తదుపరి సర్వదర్శన టోకెన్ల జారీపై వివరాలను ముందుగానే తెలియజేస్తామని, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కొనసాగుతాయని తితిదే స్పష్టం చేసింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం వద్ద భక్తులకు సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్న తరుణంలో ఈ కౌంటర్ల క్యూలైన్ల వద్దకు భక్తులు గుంపులుగా చేరుతుండటంతో కరోనా వ్యాపించే ప్రమాదం పొంచి ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తితిదే తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.