దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండడంతో వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్రం ఒక
కీలక నిర్ణయం తీసుకుని ఈ నెల 11వ తేదీ నుంచి పని ప్రదేశాల్లోనే వ్యాక్సిన్‌ వేసేందుకు అనుమతించింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నట్టు, 45ఏళ్లు పైబడిన వారందరికీ పని ప్రదేశాల్లోనే టీకా వేసేందుకు అనుమతినిచ్చింది. కనీసం 100 మంది టీకా వేయించుకొనేందుకు సిద్ధంగా ఉంటే అక్కడే వ్యాక్సినేషన్‌ చేపట్టేలా ఏర్పాట్లు చేయాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది.