వార్తలు (News)

తెలంగాణలో 772 కొత్త కేసులు.. 7 మరణాలు..!!

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,10,141 కరోనా పరీక్షలు నిర్వహిస్తే 772 కొత్త కేసులు నమోదవ్వడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,29,054కు చేరింది. నిన్న ఒక్కరోజే ఏడుగురు కోవిద్తో మృతి చెందగా ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,710కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 748 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 6,13,872కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,472 యాక్టివ్‌ కేసులున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •