అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

హైతీ దేశాధ్యక్షుడి దారుణ హత్య!!

హైతీ అధ్యక్షుడు జొవెనెల్ మోస్ హత్యకు గురయ్యారు. అదే విషయాన్ని ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రి జోసెఫ్ స్పష్టం చేసారు. దేశ రాజధానిలో ఉన్న అధ్యక్షుడి ఇంటిపై స్థానిక కాలమానం ప్రకారం ఒంటి గంటకు గుర్తుతెలియని కొందరు సాయుధులు చొరబడి దాడి చేసారు. ఆ దాడిలో అధ్యక్షుడి భార్య కూడా గాయపడినట్లు అనుమానిస్తున్నారు. దేశంలో అల్లర్లు జరగకుండా శాంతిభద్రతలను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తాత్కాలిక ప్రధానమంత్రి జోసెఫ్ చెప్పారు.
జొవెనెల్ పదవి కాలం 2021 ఫిబ్రవరిలోనే ముగిసిందని, వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని హైతీ విపక్షాలు డిమాండ్ చేయగా తన పదవి కాలం మరో ఏడాది ఉందంటూ ఆయన గద్దె దిగడానికి నిరాకరించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •