టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

13 ఏళ్ళ చిన్నారి అద్భుతం.. వికేంద్రీకృత అనువర్తనాల అభివృద్ధి!!

గోవాకు చెందిన 13 ఏళ్ల విద్యార్థి గజేష్ నాయక్ సాఫ్ట్వేర్ రంగంలో ఎంతో నాలెడ్జ్ సంపాదించి పాలిగాన్ నెట్వర్క్లో వేగంగా యాప్లను రూపొందించి ఔరా అనిపించాడు. ఇక ఈ 13 ఏళ్ల విద్యార్థి తయారు చేసిన యాప్ ద్వారా ఎంతోమంది క్రిప్టో కరెన్సీ లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ యాప్ క్రిప్టో కరెన్సీ లో పెట్టుబడి పెట్టడానికి అటు వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ 13 ఏళ్ల బాలుడు రెండు వికేంద్రీకృత అనువర్తనాలను అభివృద్ధి చేశాడు. పాలిగాజ్ మరియు స్టేబుల్ గాజ్ అనే అనువర్తనాలను తయారు చేశాడు ఈ బాలుడు. ఈ రెండూ కూడా క్రిప్టోకరెన్సీ లో పెట్టుబడులు పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఉంటాయి. అయితే పాలిగాజ్ అనేది ఒక వికేంద్రీకృతమైన ఫైనాన్స్. అంతే కాక నాన్ ఫంగల్ టోకెన్ ఫ్లాట్ఫామ్ అని చెప్పాలి.

అసలు క్రిప్టోకరెన్సీ అనే అంటే ఏంటంటే పెట్టుబడులు నిర్వహించడానికి ఇన్వెస్ట్మెంట్ మేనేజర్లు లేదా బ్యాంకింగ్ సిస్టమ్స్ లేకుండా నేరుగా నాన్ కస్టోడియల్ ప్రోగ్రాం లను ఉపయోగించడం! అలా క్రిప్టోకరెన్సీ కోసం యాప్ ను కనుగొన్న బాలుడు ప్రస్తుతం మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ 13ఏళ్ళ బాలుడు 2020 లో లాక్ డౌన్ సమయంలోనే క్రిప్టో వెంచర్ ప్రారంభించడానికి కంటెంట్ కూడా తయారు చేయడం మొదలుపెట్టాడు ఇప్పటికే సి, సి ప్లస్ ప్లస్,జావా, జావా స్క్రిప్ట్ లాంటి ఎన్నో కంప్యూటర్ లాంగ్వేజ్ లను కూడా నేర్చుకుని సునాయాసంగా కోడింగ్ చేస్తున్నాడు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •