వార్తలు (News)

ఇండియాలో తొలి ‘ఈటా’ వేరియంట్‌ కేసు నమోదు!!

కరోనా వైరస్ రోజుకో రూపాన్ని ధరిస్తూ, జన్యు క్రమాన్ని మార్చుకుంటూ తన మనుగడ సాగిస్తుంది. బ్రిటన్​లో గుర్తించిన ‘ఈటా వేరియంట్​’ భారత్​కూ పాకింది. దక్షిణ కన్నడ జిల్లాలోని మూదబిద్రే నాలుగు నెలల క్రితం దుబాయ్​ నుంచి గ్రామానికి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అతనికి పరీక్షలు నిర్వహిస్తే అతడికి కరోనా పాజిటివ్​గా తేలిందని, కొద్ది రోజుల తర్వాత కోలుకున్నట్లు పేర్కొన్నారు. బాధితుడితో సన్నిహితంగా ఉన్న దాదాపు 100 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించి వైరస్​ జన్యు క్రమంపై పరిశోధన చేసేందుకు నమూనాలను పరిశోధన కేంద్రానికి పంపగా ఆ వ్యక్తిలో ఈ కొత్త రకం బయటపడినట్లు వివరించారు.

గతేడాది డిసెంబర్‌లో బ్రిటన్‌తోపాటు నైజీరియాలో కూడా ఈటా వేరియంట్‌ను గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న బ్రిటన్‌లో 56 కేసులు వెలుగుచూడగా డెన్మార్క్‌లో కూడా పలు కేసులు బయటపడ్డాయి. కాగా దీనిని ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    4
    Shares
  • 4
  •  
  •  
  •  
  •