ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

రోజుకొక గ్లాసు మేకపాలు.. కావలసినన్ని పోషకాలు!!

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆరోగ్యం విలువ అందరికి బాగా తెలిసివచ్చింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యం మెరుగు పరుచుకోవడానికి ఎలాంటి ఆహరం తీసుకోవాలనే అంశం మీద అందరూ దృష్టి పెట్టారు.

మనిషికి పూర్తిస్ధాయిలో పోషకాలు అందాలంటే పాలు తప్ప మరో మార్గంలేదనేది నిపుణుల మాట! పాలు అనగానే అందరికి గుర్తుకు వచ్చేవి ఆవుపాలు, గేదెపాలు. అయితే ఈ రెండింటికన్నా ఎక్కువగా పోషకాలు కలిగిన పాలు మేకపాలు. గేదె, ఆవు పాల కంటే మేక పాలు చాలా శ్రేష్టమైనవని ఆరోగ్యనిపుణులు ఇప్పటికే అనేమార్లు స్పష్టం చేశారు ఎందుకంటే ఆవు పాలల్లో గేదెపాలలో లేనన్ని మాంసకృత్తులు, కాల్షియం, కార్భోహైడ్రేట్లు, మేక పాలల్లో ఉంటాయి.

మేకపాలల్లో ఎముకల పటుత్వాన్ని పెంచే విటమిన్ డి, కాల్షియం సమృద్ధిగా దొరుకుతాయి. కీళ్ళ నొప్పులు, అర్ధరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు మేకపాలు తాగితే వాటి నుండి ఉపశమనం పొందవచ్చనేది నిపుణుల మాట! అలాగే మేకపాలలో ఉండే ఫ్యాట్ తేలికగా జీర్ణమయ్యేలా చేస్తాయి కాబట్టి జీర్ణ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు మేకపాలు తీసుకోవటం ఉత్తమం.

శరీరంలోని హెచ్డిఎల్ స్ధాయిని మేకపాలు పెంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచే సెలినియం అనే ఖనిజం ఎక్కుగా ఉంటుంది. థైరాయిడ్ వంటి వ్యాధులకు ఈ సెలేనియం ఎంతో మేలు చేస్తుంది. అందుకే రోగాలు మీదరికి చేరకుండా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకొక గ్లాసు మేకపాలు తాగటం మంచిది.

చర్మ సంబంధిత సమస్యలు తొలగించి కొత్తకణాలు ఏర్పడేలా చేసేందుకు మేకపాలల్లోని విటమిన్ ఎ, ఇ లు తోడ్పడతాయి. ఎర్ర రక్తకణాల అభివృద్ధి వేగవంతం చేస్తుంది. క్యాన్సర్ కారకాలను కూడా ఈ మేకపాలు నిర్మూలిస్తాయని నిపుణులు అంటున్నారు. మేకపాలల్లో లాక్టోజ్ చాలా తక్కువగా ఉంటుంది. గేదె, ఆవు పాలల్లో ఉండే ఎ1 కేసిన్ ఉంటుంది. దీని వల్ల జీర్ణ సంబంధమైన సమస్యలు వస్తాయి. మేకపాలల్లో ఎ2 కేసిన్ ఎక్కవగా ఉండటం వల్ల జీర్ణసమస్యలు దరిచేరవు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •