అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

అనిల్‌ కుంబ్లే రికార్డు బద్దలు కొట్టిన అండర్సన్‌!!

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో గురువారం రెండోరోజు అండర్సన్‌ ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టి 41వ ఓవర్‌లో చెతేశ్వర్‌ పుజారా (4), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(0)ను వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చాడు. దాంతో 619 వికెట్లతో గురువారం కుంబ్లే సరసన నిలిచిన తర్వాత శుక్రవారం మూడోరోజు ఆటలో కేఎల్‌ రాహుల్‌ (84; 214 బంతుల్లో 12×4)ను ఔట్‌ చేయడంతో అండర్సన్‌ కొత్త రికార్డును సృష్టించాడు. ఇప్పుడు అతడు కుంబ్లేను అధిగమించి మరింత ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ 563 వికెట్లతో ఐదో స్థానంలో నిలువగా మరోవైపు అండర్సన్‌ 2003లో అరంగేట్రం చేసిన నాటి నుంచి విజయవంతమైన పేసర్‌గా కొనసాగుతున్న క్రమంలోనే అతడు 163వ టెస్టులో కుంబ్లే రికార్డును బద్దలుకొట్టాడు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •