ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

కొవిడ్‌-19 నుండి కోలుకున్నవారిలో 7 నెలల తర్వాత కూడా తగ్గని యాంటీబాడీలు!!

కొవిడ్‌-19 నుంచి కోలుకున్న వారిలో యాంటీబాడీలు ఏడు నెలల తర్వాత కూడా స్థిరంగా కొనసాగుతున్నట్లు, కొంతమందిలో అవి పెరగడాన్నీ గమనించినట్టు, సాధారణ జలుబును కలిగించే కరోనా వైరస్‌లను లక్ష్యంగా చేసుకొనే యాంటీబాడీలు కలిగి ఉన్నవారికి కూడా కొవిడ్‌ నుంచి రక్షణ లభించొచ్చని స్పెయిన్‌లోని బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తేలింది.

గతేడాది మార్చి నుంచి అక్టోబరు మధ్య 578 మంది ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది నుంచి నాలుగు భిన్న సమయాల్లో రక్త నమూనాలు సేకరించి, పరిశీలించగా కరోనాలోని ఆరు భిన్న భాగాలపై పనిచేసే ఐజీఏ, ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీల స్థాయిని కొలిచారు. కరోనాలోని న్యూక్లియోక్యాప్సిడ్‌ను లక్ష్యంగా చేసుకునే ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీలు మినహా మిగతా ఐజీజీ యాంటీబాడీలు స్థిరంగా కొన్ని నెలల పాటు కొనసాగినట్లు తేల్చారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •