క్రైమ్ (Crime) రాజకీయం (Politics) వార్తలు (News)

త్రిపుర సీఎంపై హత్యాయత్నం!

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌ ను కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నించగా సీఎం అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. బిప్లవ్‌ దేవ్‌ గురువారం సాయంత్రం వాకింగ్‌ చేసేందుకు బయటకు వచ్చి అధికారిక నివాసానికి సమీపంలో వాకింగ్‌ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు కారు నడుపుకొంటూ భద్రతా వలయంలోకి దూసుకు రావడంతో ముఖ్యమంత్రి వెంటనే పక్కకు జరిగి ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఈ ఘటనలో సీఎం భద్రతాసిబ్బంది ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. కారును ఆపేందుకు సెక్యూరిటీ ప్రయత్నించినప్పటికీ వారు వేగంగా వెళ్లిపోయారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం అర్ధరాత్రి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ నిందితులు సీఎంపై దాడికి ఎందుకు ప్రయత్నించారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని, దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •