క్రైమ్ (Crime) వార్తలు (News)

విస్మయా కేసు: ఉద్యోగం నుంచి కిరణ్ శాశ్వత తొలగింపు!!

కేరళలోని కొల్లాంలో నివాసం ఉంటున్న ఎస్ వి. విస్మయా నాయర్ (24) అనే యువతి ఆయుర్వేదిక డాక్టర్. కొల్లాంలోనే రవాణా శాఖలో అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్ పెక్టర్ గా (ఆర్ టీఓ)గా ఉద్యోగం చేస్తున్న కిరణ్ కుమార్ (30) తో విస్మయా నాయార్ కు వివాహం చెయ్యాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కిరణ్ ను పెళ్లి చేసుకుంటే తాను జీవితాంతం సుఖంగా ఉంటానని లేడీ డాక్టర్ విస్మయా నాయర్ బావించి ఆర్ టీఓ ఉద్యోగం చేస్తున్న కిరణ్ కుమార్ ను పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు చెప్పడంతో లేడీ డాక్టర్ విస్మయా నాయర్ ఓకే చెప్పింది. 2020 జూన్ నెలలో కొల్లాంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి గ్రాండ్ గా జరిగింది.

వివాహం జరిగిన తరువాత రెండు మూడు నెలలు విస్మయా నాయర్ తో ఆమె భర్త కిరణ్ సంతోషంగానే ఉన్నాడు. భర్త కిరణ్ తో కాపురం చేసుకుని సంతోషంగా ఉందామని అత్తారింటిలో అడుగు పెట్టిన లేడీ డాక్టర్ విస్మయాకు మూడు నెలల తారువాత నుండి భర్త కిరణ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు ప్రత్యక్ష నరకం చూపించారు.

విస్మయా నాయర్ కు పెళ్లి చేసిన సందర్బంలో ఆమె తండ్రి త్రివిక్రమన్ నాయార్ కట్నం కింద పెళ్లి కొడుకు కిరణ్ కు 800 గ్రాముల బంగారు నగలు, కొత్త కారు, రూ. 10 లక్షల నగదు ఇచ్చారు. కానీ ఆ తరువాత తనకు మరొ కొత్త కారు కావాలని, లేదంటే రూ. 10 లక్షలు ఇవ్వాలని, ముందుగా చెప్పిన వరకట్నం తీసుకురాలేదని భర్త కిరణ్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులు టార్చర్ పెట్టడంతో లేడీ డాక్టర్ విస్మయా నాయర్ తట్టుకోలేకపోయింది.

కొంతకాలం పుట్టింటిలో ఉన్న విస్మయా నాయర్ తరువాత పెద్దలు రాజీ పంచాయితీలు చెయ్యడంతో ఆమె భర్త కిరణ్ ఇంటికి వెళ్లిపోయింది. చాలా కాలం భర్త కిరణ్ టార్చర్ తట్టుకుని సర్దుకుపోదామని అనుకున్న లేడీ డాక్టర్ విస్మయా నాయర్ చివరికి ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. తన భర్త కిరణ్ తనను ఎలా టార్చర్ పెడుతున్నాడో అనే పూర్తి సమాచారంతో పాటు కొన్ని ఫోటోలు వాట్సాప్ లో తల్లిదండ్రులు, సోదరుడికి పంపించిన లేడీ డాక్టర్ విస్మయా 2021 జూన్ 24వ తేదీన భర్త కిరణ్ ఇంటిలోని బాత్ రూమ్ లో ఆత్మహత్య చేసుకుంది.

డాక్టర్ విస్మయా నాయర్ ఆత్మహత్య చేసుకోవడం కేరళను కుదిపేసింది. విస్మయా ఆత్మహత్యకు కారణం అయిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని, ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరణమని కేరళ సీఎం పినరయి విజయన్ అప్పట్లో విచారం వ్యక్తం చేశారు. కిరణ్ ను వెంటనే ఆరెస్టు చెయ్యాలని కేరళ సీఎం పినరయి విజయన్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

విస్మయా భర్త కిరణ్ ప్రభుత్వ అధికారి కావడంతో పెద్ద ఎత్తున నిరసనలు మిన్నంటగా అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణకు 45 రోజులు గడువు ఇచ్చి వెంటనే విచారణ పూర్తి చెయ్యాలని కేరళ రవాణా శాఖా మంత్రి ఆంటోని రాజు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 6వ తేదీ శుక్రవారంతో కేరళ ప్రభుత్వం ఇచ్చిన గడువు పూర్తి అయ్యింది.

చివరకు విస్మయ ఆత్మహత్యకు కారణం అయిన భర్త కిరణ్ అరెస్టు అయ్యి జైలుపాలైనాడు. కిరణ్ నేరం చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూడడం, కిరణ్ బ్యాంకు ఖాతాలను పరిశీలిచగా అతను ఆర్ టీఓ ఉద్యోగం అడ్డం పెట్టుకుని అక్రమంగా డబ్బులు సంపాధించాడని వెలుగు చూడడంతో కిరణ్ ను ప్రభుత్వ ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించామని కేరళ రవాణా శాఖా మంత్రి ఆంటోని రాజు మీడియాకు చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •