జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఇక ముందు అత్యవసర ఫిర్యాదులకు ‘డయల్ 112’ ??

అత్యవసర సమయాల్లో ఫిర్యాదుల స్వీకరణకు ఇకపై దేశ వ్యాప్తంగా ప్రజలు డయల్ చేసే 100 స్థానంలో డయల్ 112 ను ప్రవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే నిర్ణయించింది. ప్రజల్లో అవగాహన కల్పించాలని ఈ ఏడాది ప్రారంభంలో కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టా సారించిన నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్దం చేసింది.

మరో రెండు నెలల వరకు డయల్ 100 అందుబాటులో ఉండనున్నట్టు సమాచారం! ఆ తరువాత డయల్ 100కి కాల్ చేసినా అది 112కు అనుసంధానం అయ్యేలా చేశారు. ఈ నెల చివరి వరకు 112కు సంబందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ అధికారులు, కాంట్రల్ రూంలో పనిచేసేవారికి నేర్పాలని నిర్ణయించారు.

వందల మంది ఒకేసారి ఫోన్ చేసినా స్వీకరించేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశాయి. ట్రాఫిక్ కూడళ్ల వద్ద ప్లకార్డు లు పట్టుకుని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పోలీస్ వాహనాలపై కూడా 112 స్టిక్కర్లను అతికించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇతర శాఖల ఉద్యోగుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సామాజిక మాధ్యమాలు, ప్రసార సాధనాల ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.

ప్రస్తుతం దేశంలో పోలీసు సేవలకు 100, అంబులెన్స్‌కు 108, అగ్నిమాపక సేవలకు 101 నంబర్లను ఉపయోగిస్తుండగా అమెరికా, యూరప్ దేశాలలో మాత్రం అన్ని సేవలకు ఒకే నంబరును వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా ఒకే నంబరును తీసుకురావాలని నిర్ణయించింది. కొత్త నంబరులో విపత్తు నివారణ, గృహ హింస, వేధింపులకు సంబంధించిన సేవలను కూడా జోడించనుంది. ఇప్పుడు కేవలం నాలుగైదు రాష్ట్రాల్లో మాత్రమే ఈ నంబరు అమలవుతుండగా ఈ ఏడాది అక్టోబరు నాటికల్లా దేశవ్యాప్తంగా ఈ నంబరును అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •