అంతర్జాతీయం (International) జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

స్పేస్ టూర్ చేస్తారా? వర్జిన్ గెలాక్టిక్ టికెట్లు మీకోసం!!

తెలుగమ్మాయి, ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ శిరీష బండ్ల గత నెల 11న వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ప్లేన్‌లో రోదసి టూర్ చేసి వచ్చిన సంగతి పాఠకులకు విదితమే! అంతరిక్షానికి వెళ్లి రావడం గురించి చెప్పాలంటే.. అద్భుతం అనే మాట కన్నా ఇంకా పెద్ద పదంకోసం వెతుకుతున్నా. పై నుంచి భూమిని చూడటం అనేది ఒక లైఫ్​ చేంజింగ్ ఎక్స్ పీరియెన్స్’ అని నాడు శిరీష ఆనందాన్ని వ్యక్తంచేశారు.

ఇలాంటి అనుభూతి పొందడం ఒక అద్భుతం! అయితే ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా కాస్ట్‌లీ. సరదాగా ట్రిప్‌ వెళ్లినట్లుగా స్పేస్‌లోకి జాయ్ రైడ్ వెళ్లాలనుకునే సంపన్నులు ఈ టూర్ చేసి రావొచ్చు. భూమిపై నుంచి దాదాపు 80 కిలోమీటర్ల పైగా ఎత్తులోకి వెళ్లి జీరో గ్రావిటీని అనుభూతి పొందాలనుకునే వారి కోసం టికెట్లు అమ్మకం షురూ చేస్తున్నట్లు వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ గురువారం ప్రకటించింది. ఈ టికెట్ ధర ఒక్కొక్కటి సుమారు రూ.3.33 కోట్లు (4.5 లక్షల డాలర్లు) అని తెలిపింది. మీ దగ్గర టికెట్ కొనేంత డబ్బులు ఉండి ఆ అనుభూతి పొందాలనే కోరిక ఉంటె మీరు కూడా ఒకసారి జీరో గ్రావిటీ అనుభూతి పొంది వచ్చేయండి మరి!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •