జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఉచిత వై-ఫై ఆధారిత ఇంటర్నెట్ ఇక లేనట్టే: కేంద్ర ప్రభుత్వం??

భారతీయ రైళ్లలో ఫాస్ట్ అండ్ ఫ్రీ ఇంటర్నెట్ సౌకర్యం అందించడం కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ట్రైన్‌లలో ఉచిత వై-ఫై ఆధారిత ఇంటర్నెట్ అందించే ప్రాజెక్ట్‌ను భారతీయ రైల్వేశాఖ ఉపసంహరించుకుంది. ఉచిత ఇంటర్నెట్ అందించడం అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని రైల్వే మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌కు విన్నవించింది. పైలట్ ప్రాజెక్టుగా హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా ఉచిత ఇంటర్నెట్ సేవలు అందించినట్లు, ఈ టెక్నాలజీ భారీ మూలధనంతో కూడుకున్నదని ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు.

రైలు ప్రయాణికులకు ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్ అవైలబిలిటీ కూడా సరిపోలేదని, ట్రైన్‌లలో వై-ఫై ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించడానికి తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలను అందించే టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులో లేదని, ఇక హాల్ట్ రైల్వే స్టేషన్లు మినహా అన్ని రైల్వే స్టేషన్లలో ‘వీడియో సర్వైలెన్స్ సిస్టమ్’ను ఏర్పాటు చేసే పనులకు ఆమోదం లభించిందని అశ్వినీ వైష్ణవ్‌ పార్లమెంట్‌కు తెలియజేశారు.

ఇప్పటివరకూ 814 రైల్వేస్టేషన్లలో సీసీటీవీలు ఏర్పాటు చేశారని, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ లతో పాటు ప్యాసింజర్ రైళ్లతో సహా అన్ని కోచ్‌లలో సీసీటీవీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, ఇప్పటివరకూ 4,141 కోచ్‌లలో సీసీటీవీలను మార్చామని వెల్లడించారు. ప్రస్తుతం భారతీయ రైల్వేశాఖ 6,000 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లలో స్వీయ-స్థిరమైన ప్రాతిపదికన జాతీయ ట్రాన్స్‌పోర్టర్ కు ఉచితంగా వై-ఫై సౌకర్యాన్ని అందిస్తోంది. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్‌టెల్ సహాయంతో ఈ సౌకర్యాన్ని అందిస్తోంది. కానీ సరైన టెక్నాలజీ లేకపోవడంతో ప్రస్తుతం ప్రభుత్వం ఉచిత ఇంటర్నెట్ ప్రాజెక్టును తొలగించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    13
    Shares
  • 13
  •  
  •  
  •  
  •