వార్తలు (News)

కోవిడ్ రోగి మెదడులో ఫంగస్ చీము.. హైదరాబాద్ లో కొత్త కేసు!!

తెలంగాణలో ఇప్పటికే బ్లాక్​ ఫంగస్​, వైట్​ ఫంగస్​ దాడుల ప్రభావంతో సతమతమవుతుంటే ఇప్పడు కొత్తగా మెదడులోకి వైట్​ ఫంగస్​ ప్రవేశించి, ఏకంగా చీమునే సృష్టిస్తోంది. అది కూడా మధుమేహం కూడా లేని రోగిలో కనిపించి కలవరపెడుతుంది. కరోనా నుంచి కోలుకున్న రోగి మెదడులో వైట్​ ఫంగస్ చీము​ (ఆస్పెర్‌గిల్లస్) ఏర్పడిన అరుదైన కేసు హైదరాబాద్​లో వెలుగుచూసింది. ఆ రోగి ఈ ఏడాది మేలో కోవిడ్ నుంచి కోలుకున్నారు. అప్పట్లోనే అవయవాల బలహీనత, మాట్లాడటం కష్టంగా ఉన్నట్లు వైద్యుల దృష్టికి తీసుకొచ్చారని తెలిసింది. మందులు తీసుకున్న తర్వాత కూడా గడ్డలు ఏర్పడ్డాయని మెదడు స్కాన్​ చేయడంతో డాక్టర్లు కనుగొన్నారు. అప్పట్లో చేసిన శస్త్రచికిత్స తర్వాత ఇప్పడు రోగి మెదడులో తెల్లటి ఫంగస్​తో చీము ఏర్పడిందని తెలిసింది.

సన్‌షైన్ హాస్పిటల్​కు చెందిన సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ పి రంగనాథం మాట్లాడుతూ ”ఇది సంభవించడం చాలా అరుదు, రోగి మెదడులోకి తెల్ల ఫంగస్ కారణంగా చీము వచ్చింది. మెదడులో తెల్లటి ఫంగస్ ద్వారా ఏర్పడిన చీము ఉన్నందున ఈ కేసు ప్రత్యేకమైంది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఇన్‌ఫెక్షన్ వస్తుంది.

సాధారణంగా, కోవిడ్​రోగులలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే కనిపిస్తాయి. కానీ,ఈ రోగికి మధుమేహం లేదు. బ్లాక్​ ఫంగస్​ వెళ్లినట్లు ముక్కులో నుంచి తెల్ల ఫంగస్ మెదడులోకి​ వెళ్లలేదు’ అని, రోగి పరిస్థితిపై మరిన్ని వివరాలను వెల్లడిస్తూ కోవిడ్ రెండో వేవ్​ సమయంలో ఆసుపత్రిలో చేరిన ఆరో రోజున రోగి శరీరంలో బలహీనత, మాట్లాడటం కష్టంగా ఉందని చెప్పారని రంగనాథం తెలిపారు.

ప్రారంభంలో రోగికి హెమటోమా కోసం చికిత్స చేశారని, అయితే ఎంఆర్​ఐ తరువాత పుండు పరిమాణం పెరిగిందని, చిన్న గాయాలు మిగిలి ఉన్నాయని స్పష్టంచేశారు. ఈ అరుదైన చీమును ఆస్పెర్‌గిల్లోసిస్ అని డాక్టర్ పేర్కొన్నారు. మెదడులోని రక్తనాళాలపై తెల్లటి ఫంగస్ దాడి చేయడం వల్ల ఏర్పడిందని ఆయన చెప్పారు. ఆస్పెర్‌గిల్లస్ ద్వారా మెదడు వాపు (గ్రాన్యులోమా) సాధారణం అయినప్పటికీ, చీము ఏర్పడే తెల్ల ఫంగస్ కేసులను అరుదుగా చూస్తామని ఆయన తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •