అంతర్జాతీయం (International) ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

సౌదీ అరేబియాకు వెళ్ళాలి.. కొవిషీల్డ్ ఇప్పించండి!!

ఒక వ్యక్తికి ఎదురైన వింత సమస్య పరిష్కారానికై అతను హైకోర్టుకు మెట్లు ఎక్కాడు. ఆ సమస్య పరిష్కారం విషయంలో కోర్టు కూడా ఏం చెప్పాలో తెలియక కేంద్ర ప్రభుత్వం స్పందన కోరింది. కేరళలోని ఒక వ్యక్తి సౌదీ అరేబియాకు తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఆ వ్యక్తి ఇప్పటికే కొవాగ్జిన్ రెండు డోసుల వ్యాక్సినూ తీసుకున్నాడు. అయితే సౌదీ అరేబియాలో కొవాగ్జిన్‌ను గుర్తించడం లేదు. దీంతో మరోసారి కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి అతడు సిద్ధమై దీనికి అనుమతి కోరుతూ ఆ వ్యక్తి కేరళ హైకోర్టును ఆశ్రయించి తనకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఇప్పించాల్సిందిగా కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. ఇదే విషయంలో కేంద్రం స్పందన తెలపాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఇంకా స్పందన రావాల్సి ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •