అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు తొలి గోల్డ్ మెడల్!!

ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లో భారత్ కు తొలిసారి పతకం వచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిచి యావత్ దేశాన్ని సంబరాల్లో ముంచాడు. 100 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం సాధించిన ఇండియన్ అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. మొదటి అవకాశంలోనే 87.03 మీటర్ల దూరం ఈటె విసిరి, ఆ తర్వాత రెండో అవకాశంలో మరింత మెరుగ్గా 87.53 మీటర్లు విసిరి, మూడో ప్రయత్నంలో 76.79 మీటర్లకు విసిరాడు. ఆ తర్వాత రెండుసార్లు ఫౌల్స్ పడి ఆరో రౌండ్‌లో 84.24 మీటర్ల దూరం జావెలిన్ విసిరాడు. అందులో అత్యుత్తమ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుంటారు. ఇలా అందరిలోనూ అత్యధిక దూరం జావెలిన్ విసిరింది మన నీరజ్ చోప్రానే. ఏకంగా 87.53 మీటర్లు విసిరిన ఆటగాడిగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •