అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

చరిత్ర సృష్టించిన అదితికి పలువురి ప్రశంశలు!!

టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ తృటిలో పతకం చేజార్చుకున్న భారత యువ గోల్ఫర్‌ అదితి అశోక్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు అభినందిస్తూ గోల్ఫ్‌లో భారత్‌ను సరికొత్త శిఖరాలను చేర్చావంటూ కొనియాడారు.

గోల్ఫ్‌ కోటపైకి దూసుకెళ్లి బారత్‌ను కొత్తగా చూపించింది. ఈ ఆట భవిష్యత్తుపై దృష్టిపెట్టేలా మాపై ఒత్తిడి పెంచినందుకు కృతజ్ఞతలు – ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా

బాగా ఆడావు అదితి. టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శించావు. పతకం తృటిలో తప్పిపోయి ఉండొచ్చు కానీ ఈ ఆటలో ఏ భారతీయుడు చేరుకోలేనంత దూరం వెళ్లావు. ఆ దారిలో మెరిశావు. నీ భవిష్యత్తు మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా – ప్రధాని మోదీ

టోక్యో ఒలింపిక్స్‌లో మరో భారత పుత్రిక తనదైన ముద్ర వేసింది. అదితి అశోక్‌ నువ్వు గొప్ప ప్రదర్శన చేశావు. ఈ రోజు నీ చరిత్రాత్మక ప్రదర్శనతో భారత గోల్ఫింగ్‌ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లావు. అద్భుతమైన నైపుణ్యంతో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన నీకు అభినందనలు – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌

ఒలింపిక్‌ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత తొలి మహిళా గోల్ఫర్‌. టోక్యోలో అద్భుత ప్రదర్శన చేసిన అదితి అశోక్‌కు స్టాండింగ్ ఒవేషన్‌ దక్కుతుంది. చివరి వరకు ఎంతో గొప్పగా ఆడి చరిత్ర సృష్టించావు – క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

అదితి అశోక్‌.. నువ్వు తృటిలో పతకం కోల్పోయినప్పటికీ టోక్యోలో నాలుగో స్థానంలో నిలిచావు. నీ విజయం పట్ల మేమంతా గర్విస్తున్నాం. నీ ప్రయాణం మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా – కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    14
    Shares
  • 14
  •  
  •  
  •  
  •