అంతర్జాతీయం (International) వార్తలు (News)

కార్చిచ్చు పాలవుతున్న లక్షలాది ఎకరాల అటవీ సంపద!!

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో రేగిన కార్చిచ్చు భీకరమైన వేడిగాలుల ధాటికి మంటలు వేగంగా విస్తరిస్తూ అడ్డొచ్చిన వాటిని దహించివేస్తోంది. అమెరికాలోని 13 రాష్ట్రాలకు ఈ కార్చిచ్చు విస్తరించడంతో మంటలను అదుపు చేసేందుకు 20వేల మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.

ఉత్తర కాలిఫోర్నియాలోని మౌంటెన్‌ పట్టణాన్ని కార్చిచ్చు చుట్టుముట్టడంతో వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇప్పటికే మంటల్లో చిక్కుకుని పలు ఇళ్లు దగ్ధం కాగా.. మంటలు వ్యాపించకుండా ఉండేందుకు అగ్రిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. గంటకు 64 కి.మీ వేగంతో గాలులు వీస్తుండటంతో గ్రీన్‌విల్లేలోని సియెర్రా నివాడా పట్టణం తీవ్రంగా దెబ్బతింటోంది. మంటలు వేగంగా విస్తరించడం వల్ల ఆ ప్రాంతంలోని అడవులు ఆహుతి అవుతున్నాయి. మంటలు ఆల్మనూరు సరస్సు వరకూ విస్తరించడతో సరస్సుకు తూర్పు ప్రాంతంలో ఉంటున్న 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దావాగ్ని ధాటికి ఆకాశంలో 30వేల అడుగుల ఎత్తు వరకూ నల్లటి పొగ ఆవరించినట్టు అగ్నిమాపక అధికారులు వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    94
    Shares
  • 94
  •  
  •  
  •  
  •