అంతర్జాతీయం (International) జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

NRA CET పాసైతే రూ.151 కోట్ల స‍్కాలర్‌ షిప్‌!!

ఆన్‌లైన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కంపెనీ అప్‌గ్రేడ్‌కు చెందిన కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌ అప్‌గ్రేడ్‌జీత్‌ (ఎన్‌ఆర్‌ఏ) రూ.151 కోట్ల కామన్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ సీఈటీ ఉపకార వేతనాలకు అర్హత పరీక్ష నిర్వహించనుంది. ఈ నెల 8న జాతీయ స్థాయిలో ఈ పరీక్షా జరగనుంది. కాగా ఈ పరీక్ష రాసేందుకు ఇప్పటికే 2.5 లక్షల మంది నమోదు చేసుకున్నారు.

ఈ ఎగ్జామ్‌ ఆగస్ట్‌ 8న (వచ్చే ఆదివారం) నిర్వహించనుంది. ఈ ఎగ్జామ్‌ రాసే అభ్యర్ధులను రెండు రౌండ్లుగా విభజించి ప్రిలిమినరీ రౌండ్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులను మెయిన్స్‌కి ఆహ్వానిస్తారు. ఈ రెండో రౌండ్‌ లో ఎంత మంది పాస్‌ అవుతారో వారిలో మెరిట్‌ ఆధారంగా 3వేల మంది అభ్యర్ధులను ఎంపిక చేసి వారికి 6నెలల NRA CET కోర్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ని ఉచితంగా అందిస్తారు. దీంతో పాటు రూ.151కోట్ల స్కాలర్‌ షిప్‌ ను అందిస్తుండగా, ఇక రెండో రౌండ్‌లో 3వేల మందిని మినహాయించి మిగిలిన అభ్యర్ధులకు ఒక నెల NRA CET కోర్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తున్నట్లు అప్‌గ్రేడ్‌జీత్‌ సీఈఓ రితేష్‌ రౌషన్‌ ప్రకటించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •