వార్తలు (News)

విశాఖలో రుషికొండ రిసార్ట్ కూల్చివేత..!

విశాఖలో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలయ్యింది. వారాంతం వస్తే ఎక్కడ ఏ కూల్చివేతలు జరుగుతున్నాయోనని భయం మొదలయింది. ఇప్పటి వరకూ ప్రైవేటు ఆస్తులను మాత్రమే కూల్చివేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ ఆస్తులను కూడా కూల్చివేస్తుండడం గమనార్హం! విశాఖలో సముద్రాన్ని ఆస్వాదించాలనుకునేవారికి రుషికొండ బీచ్ రిసార్ట్ అద్భుతమైన ప్రదేశం! టూరిజంకు భారీ ఆదాయాన్ని తెచ్చి పెట్టే వనరు. ఇప్పుడు ఈ బీచ్ రిసార్ట్‌ను మొత్తంగా కూల్చేస్తున్నారు. రెండు కాటేజీలను ఇప్పటికే పూర్తిగా నేలమట్టం చేశారు. విశాఖ బీచ్ రోడ్‌లో గీతం కాలేజీ వైపు వెళ్తే కొండలపై ఉన్న బీచ్ రిసార్టులు చూడటానికే అద్భుతంగా ఉంటాయి. అక్కడ విడిది చేసి తెల్లవారుజామునే సముద్రాన్ని ఆస్వాదించాలనుకునే పర్యాటకుల సంఖ్య చాల ఎక్కువ!

అక్కడ అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వాటిని నిర్మించి 14ఏళ్లు మాత్రమే అయింది. అంతే కాదు ప్రతీ ఏడాది వాటికి సౌకర్యాల కోసం రూ. కోట్లు ఖర్చు చేస్తున్నారు. గత ఏడాదే రూ.రెండు కోట్లు పెట్టి 22గదుల్లో అదనపు సౌకర్యాలు కల్పించారు. అలాగే రెస్టారెంట్‌, కాన్ఫరెన్స్‌ హాలును రూ. కోటి పెట్టి సౌకర్యాలు మెరగు పరిచారు. కాంట్రాక్టర్లకు ఇంకా డబ్బులు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం కూల్చేస్తున్న బీచ్ రిసార్ట్ టూరిజం శాఖకు ఏటా రూ. 30 కోట్ల ఆదాయం తెచ్చి పెడుతుంది. ఎందుకు కూల్చివేస్తున్నారని అడిగితే అక్కడ మళ్లీ కొత్త రిసార్టులు కడతామని, కొత్త ప్రాజెక్టులో మొదటిదశ పనులు రూ.91 కోట్లతో చేపడుతున్నామని, 15 నెలల్లోగా పూర్తవుతాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ కూల్చేసిన తర్వాత కట్టలేకపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారన్నప్రశ్న విశాఖ వాసుల నుంచి వస్తుంది. దానికి సమాధానం ఎవరు చెప్తారు??

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •