ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

కొమ్ము (స్పైక్‌) ప్రొటీన్‌ కు అతి చౌకైన ఔషధం!!

రక్తంలో అసాధారణ స్థాయిలో పేరుకుపోయే కొవ్వు పదార్థాలను వదిలించడానికి ఉపయోగిస్తున్న ఒక ఔషధం కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ ను 70 శాతం తగ్గిస్తుందని బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలో తేల్చారు. కరోనా వైరస్‌లోని కొమ్ము (స్పైక్‌) ప్రొటీన్‌ మానవ కణాల్లోని ఏసీఈ2 ప్రొటీన్లతో అనుసంధానం కావడం ద్వారా ఇన్‌ఫెక్షన్‌ కలిగిస్తాయి. ఈ సంధానతను విచ్ఛిన్నం చేసే సామర్థ్యం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔషధాల్లో వేటికైనా ఉందా అన్నది శాస్త్రవేత్తలు పరీక్షించగా ఫెనోఫైబ్రేట్‌కు ఆ సామర్థ్యం ఉందని ప్రాధమిక విచారణలో తేలింది. ఇది చౌకైన ఔషధం. ప్రపంచవ్యాప్తంగా ఈ మందు సురక్షితమైందని దీన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు.

ఇది నోటిద్వారా తీసుకునే మందు. రక్తంలో కొలెస్ట్రాల్‌, లిపిడ్‌లు ఎక్కువగా ఉన్నవారికి చికిత్స కోసం దీన్ని సూచిస్తున్నారు. గత ఏడాది సేకరించిన కరోనా వైరస్‌ మూల రకంపై దీన్ని ల్యాబ్‌లో ప్రయోగించి చూశారు. ఇది 70 శాతం వరకూ ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించినట్లు తేల్చారు. కరోనాలోని కొత్త వేరియంట్లు ఆల్ఫా, బీటాపైనా ఈ ఔషధం ఇదే సమర్థతను చాటినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఇంకా పూర్తి పరిశోధన సాగించవలసిన అవసరం ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •