అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

సంతోషంగా నవ్వుతున్నారని తోటి ప్రయాణికులను పొడిచిన యువకుడు!!

టోక్యోలో శుక్రవారం రాత్రి నడుస్తున్న రైల్లో ఒక వ్యక్తి కత్తితో దాడి చేయడంతో, పది మంది గాయపడ్డారు. “రైల్లో ఉన్న మహిళలు చాలా సంతోషంగా కనిపించడంతో, నాకు చాలా కోపం వచ్చింది, అందుకే వాళ్లను చంపాలనుకున్నా” అని 36 ఏళ్ల నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. బాధితుల్లో ఒక విద్యార్థిని తీవ్రంగా గాయపడగా, మిగతావారికి స్వల్ప గాయాలయ్యాయి.

స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8.40కి ఒక వ్యక్తి సీజోగాకూన్ స్టేషన్ సమీపంలో ప్రయాణికులపై కత్తితో దాడి చేయడంతో ఆ దాడి తర్వాత బోగీలోంచి అరుపులు వినిపించడంతో డ్రైవర్ రైలును అత్యవసరంగా ఆపేశారు. తర్వాత నిందితుడు రైల్లోంచి దూకి పారిపోయాడని, రైలు సిబ్బంది ప్రయాణికులను పట్టాల మీదుగా నడిపించుకుని సమీప స్టేషన్‌కు తీసుకువచ్చారని పోలీసులు చెప్పారు.

జనం హఠాత్తుగా తనవైపు దూసుకొచ్చారని, ఒక బోగీ లోంచి మరో బోగీలోకి పరుగులు తీశారని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఈ దాడి చేసిన వ్యక్తి తర్వాత ఒక షాపు దగ్గరకు వెళ్లి న్యూస్‌లో చూపిస్తున్న ఘటనలో నిందితుడిని తనేనని, పారిపోడానికి ప్రయత్నించానని అక్కడి సిబ్బందికి చెప్పడంతో 30ల్లో ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు. మిగతా వివరాలేవీ వారు వెల్లడించలేదు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •