క్రైమ్ (Crime) వార్తలు (News)

విశాఖ ఎయిర్ పోర్ట్ లో బులెట్ల కలకలం!!

విశాఖ విమానాశ్రయంలో ఒక మహిళ హ్యాండ్ బ్యాగులో 13 గన్ బుల్లెట్లు లభించడం స్థానికంగా కలకలం రేపుతోంది. అధికారులు గుర్తించిన వెంటనే ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులకు సమాచారం అందించారు. విశాఖ ప్రాంతానికి చెందిన ఆ మహిళ తాను విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లడం కోసం ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఇమిగ్రేషన్ తనిఖీలలో ఆమె బ్యాగ్ లో 13 బుల్లెట్లు ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. వెంటనే అప్పరమత్తమైన పోలీస్ వారు వాటిని సీజ్ చేసి, అవి ఆమెకు ఎక్కడి నుంచి వచ్చాయి, హైదరాబాదుకు వాటిని ఎందుకు తనతో తీసుకెళుతోందనే ప్రశ్నలు సంధించారు. ఆమె ప్రయాణాన్ని నిలిపివేసి మరీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పూర్తి విచారణ జరిపిన తర్వాతే వివరాలు అందించగలమని ఎయిర్పోర్ట్ పోలీసులు చెపుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •