జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుని విజయానికి దూరం చేస్తున్న హైదరాబాద్??

ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు గట్టి పోటీ ఇవ్వాలంటే అది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కి మాత్రమే సాధ్యమవుతుందని సంగతి అందరికి తెలిసిందే! ఎందుకంటే దశాబ్దకాలంపైగా ఆ జట్టు హైదరాబాద్‌ చేతిలో ఆఖరి నిమిషాల్లో ఓడిపోతుంది. ఆ దెబ్బతో ప్లేఆఫ్స్‌లో చోటు కోల్పోవడం లేదా ప్లేఆఫ్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలవలేకపోవడం పరిపాటిగా మారింది. తొలుత డెక్కన్‌ ఛార్జర్స్‌ టీమ్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌పై ఆధిపత్యం చెలాయించగా తర్వాత సన్‌రైజర్స్‌ ఆ బాధ్యతలు స్వీకరించింది. దీంతో 2008 నుంచి హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ బెంగళూరుకు కొరకరాని కొయ్యలా మారిపోయింది. దాని వివరాలు ఏంటో చూసేద్దామా??

2009లో డెక్కన్‌ ఛార్జర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫైనల్స్‌లో పోటీపడగా అప్పట్లో డెక్కన్‌ ఛార్జర్స్‌ 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి బెంగళూరుకు షాకిచ్చింది.

2012 ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు లీగ్‌ దశలో తన చివరి మ్యాచ్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌తో పోటీ పడగా ఆ మ్యాచ్‌లో డీసీ షాకివ్వడంతో బెంగళూరు ఓటమిపాలైంది. దీంతో స్వల్ప నెట్‌రన్‌రేట్‌ తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది.

2013 ఐపీఎల్‌లో తొలిసారి పోటీలోకి వచ్చిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సైతం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు షాకిచ్చి అప్పటి లీగ్‌ దశలో ఎస్‌ఆర్‌హెచ్‌ తన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై విజయం సాధించి బెంగళూరును ప్లేఆఫ్స్‌కు కూడా చేరకుండా అడ్డుకుంది. దీంతో నాలుగో స్థానంలో సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌ చేరింది.

2015 ఐపీఎల్ లీగ్‌ దశలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముంబయి ఇండియన్స్‌తో చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడగా అప్పుడు ముంబయి విజయం సాధించడంతో ప్లేఆఫ్స్‌లో బెంగళూరు టాప్‌ 2లో నిలిచే అవకాశం కోల్పోయింది.

2016 ఐపీఎల్‌ ఫైనల్స్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తుదిపోరులో తలపడగా ఆ మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్‌ విజేతగా నిలిచి బెంగళూరుకు రెండోసారి కప్పు రాకుండా అడ్డుకుంది.

2020లో ప్లేఆఫ్స్‌లో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన రెండు జట్లూ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో తలపడగా ఇక్కడ కూడా సన్‌రైజర్స్‌ జట్టు బెంగళూరును ఓడించింది.

ఇక ఇప్పుడు జరుగుతున్న 2021 సీజన్‌లోనూ బుధవారం జరిగిన 52వ మ్యాచ్‌లో బెంగళూరు, హైదరాబాద్‌ జట్లు మరోసారి తలపడగా ఇక్కడ కూడా సన్‌రైజర్స్‌ నాలుగు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్‌లో కోహ్లీజట్టుకి రెండో స్థానం దక్కకుండా చేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •