అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

భూత వైద్యురాలిపై రూ. 25 లక్షల దావా వేసిన అమెరికన్!!

కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి తన వివాహాన్ని నిలబెడతానని మాటిచ్చిందని, తన మాజీ ప్రియురాలు మరో మంత్రగత్తె సహాయంతో పెట్టిన శాపాన్ని తొలిగిస్తానని సదరు సైకిక్ తనకు చెప్పిందని ఆ భూతవైద్యురాలి (సైకిక్)పై దావా వేశారు. సోఫియా ఆడమ్స్ అనే భూత వైద్యురాలు, 5100 డాలర్లు (రూ. 3.8 లక్షలు) చెల్లిస్తే శాపాన్ని తొలిగించి తన వివాహ బంధం తెగిపోకుండా కాపాడతానని మాటిచ్చిందని మౌరో రెస్ట్రెపొ చెప్పారు. టోరెన్స్ సుపీరియర్ కోర్టులో మౌరో ఈ మోసానికి సంబంధించిన కేసును దాఖలు చేశారు.

సోఫియాపై నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం, పౌర కుట్ర, భావోద్వేగాలతో ఆడుకోవడం అనే అభియోగాల కింద కేసును నమోదు చేశారు. ”శాపాన్ని తొలిగించకపోతే తన కుటుంబం ప్రమాదంలో పడుతుందని, సంతోషంగా ఉండలేమని” సోఫియా చెప్పిందని మౌరో ప్రస్తుతం 25,000 డాలర్ల (రూ. 18.6 లక్షలు) నష్టపరిహారాన్ని కోరుతున్నారు.

గూగుల్‌లో ‘సైకిక్’ల గురించి వెతికిన తర్వాత సోఫియాను కలిశానని, సోఫియాకు చెందిన వెబ్‌సైట్, ఆమెను ‘సైకిక్ లవ్ స్పెషలిస్ట్’తో పాటు ‘పీహెచ్‌డీ లైఫ్ కోచ్’గా పేర్కొనడంతో నాకు సహాయం చేయగలిగే ఒక ప్రొఫెషనల్‌తో మాట్లాడుతున్నానని నేను నమ్మాను అని మౌరో అభియోగంలో పేర్కొన్నారు.

సెషన్ల సందర్భంగా సోఫియా, మౌరో టారో కార్డులు చదివారు. ఆయనను దురదృష్టం వెంటాడుతున్నట్లుగా చెప్పారు. మౌరో మాజీ ప్రియురాలు, ఒక మంత్రగత్తెతో శాపం పెట్టించిందని, దాన్ని తొలిగించకపోతే మౌరోతో పాటు ఆయన భార్య, పిల్లలు, వివాహ బంధం నాశనమవుతుందని సోఫియా చెప్పినట్లు కోర్టు పత్రాల ద్వారా తెలిసింది. మొదటి విడతగా 1000 డాలర్లు చెల్లించినప్పటికీ సోఫియా నుంచి తనకు ఎలాంటి సహాయం లభించలేదని, తన కుటుంబం నిద్రలేని రాత్రులు గడుపుతోందని, ఆందోళన, వేదన అలాగే కొనసాగుతున్నాయని మౌరో పేర్కొన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •