ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

జామ పండు తో ఉపయోగాలు!!

వ్యాధినిరోధకతను పెంపొందించుకోవాలంటే అతి ముఖ్యమైనది ‘విటమిన్‌-సి’ అని అందరికి తెలిసిందే! ‘విటమిన్‌-సి’ కావాలంటే మనందరికీ గుర్తొచ్చే పండ్లు నిమ్మజాతికి చెందిన ఒకింత పుల్లటి-తియ్యటి పండ్లు. అయితే నారింజలో ఉండే విటమిన్‌-సి కంటే కూడా జామ లో ఉండే ‘విటమిన్‌-సి’ యే ఎక్కువ. అందుకే జామపండు ఎన్నెన్నో వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. ఇందులో పొటాషియమ్‌ కూడా ఎక్కువ కాబట్టి రక్తపోటునూ సమర్థంగా నివారిస్తుంది.

టొమాటోలో ఉన్నట్లే జామలోనూ లైకోపిన్‌ మోతాదులు చాలా ఎక్కువేనంటూ యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ పేర్కొంది. ‘లైకోపిన్‌’ అనే అద్భుత పోషకం. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌తో పాటు అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. అంటే లైకోపిన్‌ ఉన్నందున ఈసోఫేజియల్‌ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్లను నివారించడంలో జామ దోహదపడుతుంది.

కాస్తంత ముగ్గిన జామపండులో పీచు (ఫైబర్‌) చాలా ఎక్కువ. దానివల్ల మలబద్దకం తేలిగ్గా నివారితమైపోతుంది.జామ కాయ తినే అలవాటు కారణం గా ఎన్నెన్నో రకాల జబ్బులు నివారితమవుతాయి. ఉజ్జాయింపుగా చూస్తే 100 గ్రాముల జామపండులో 300 మి.గ్రా. కండర నిర్మాణ సామర్థ్యం ఉంటుంది. ఇలా చూసినప్పుడు ఎదిగే పిల్లలకూ ఇది చాలా మంచిది. ఇలాంటి అనేక గుణాలున్నందున దీన్ని ఆరోగ్యానికి ఖజానాగా వర్ణించినా అతిశయోక్తి కాదు!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    2
    Shares
  • 2
  •  
  •  
  •  
  •