దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 10,79,384 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 6,822 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.46 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే 220 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు మరణించినవారి మొత్తం సంఖ్య 4.73 లక్షలకు చేరింది. గత 24 గంటల్లో 10,004 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3.40 కోట్లకు చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 95,014కి చేరింది.