డిగ్రీ పూర్తయిన అభ్యర్థులకు ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ కామన్​ అడ్మిషన్​ టెస్ట్​ నోటిఫికేషన్​ ను రిలీజ్​ చేసింది. ఈ ఎగ్జామ్​తో ఫ్లయింగ్ డ్యూటీ, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచీల్లో ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు దుండిగల్​ ఎయిర్​ఫోర్స్​ అకాడమిలో ట్రైనింగ్​ ఇస్తారు. ఎగ్జామ్​ ప్యాటర్న్​, సెలెక్షన్​ ప్రాసెస్, సిలబస్​ గురించి వివరాలు ఏంటంటే..

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ 2023వ సంవత్సరానికి ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(ఏఎఫ్‌క్యాట్‌), ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ కింద అవివాహిత పురుషులు, మహిళలు అప్లై చేసుకోవచ్చు. ఐఏఎఫ్ ఏటా రెండుసార్లు మే/జూన్, డిసెంబర్​ నెలల్లో ఈ ఎగ్జామ్​ ప్రకటన విడుదల చేస్తుంది. ఇందులో టెక్నికల్‌, నాన్‌టెక్నికల్ పోస్టులు ఉంటాయి. ప్రస్తుతం రెండో బ్యాచ్ కోసం నోటిఫికేషన్ రిలీజ్​ చేశారు. దీనిద్వారా ఏఎఫ్‌సీఏటీ ఎంట్రీ, ఎన్‌సీసీ ఎంట్రీ, ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ, మెటీరియాలజీ ఎంట్రీ చేపట్టనున్నారు.

ఖాళీలు: 317
బ్రాంచిల వారీగా పోస్టులు:

  1. ఫ్లయింగ్‌-77
  2. గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌)-129
  3. గ్రౌండ్‌ డ్యూటీ (నాన్‌ టెక్నికల్‌)-111
    విద్యార్హతలు: అభ్యర్థులు 12వ తరగతి పాసై ఉండాలి. మ్యాథ్స్​, ఫిజిక్స్ సబ్జెక్ట్స్‌లో ఈ ఎగ్జామ్ పాస్ కావాలి. రెండు సబ్జెక్ట్స్‌లో కనీసం 50 శాతం చొప్పున మార్కులు ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ లేదా బీటెక్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
    వయస్సు: 2023 జనవరి 1 నాటికి ఫ్లై బ్రాంచ్ అభ్యర్థులకు 20 నుంచి 24 ఏళ్లు, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ అభ్యర్థులకు 20 నుంచి 26 ఏళ్లు మధ్య ఉండాలి.
    అప్లికేషన్​ ఫీజు: రూ.250
    జీతం: రూ.56,100 నుంచి రూ.1,77,500.
    సెలెక్షన్​ ప్రాసెస్​: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
    దరఖాస్తులు: 1 డిసెంబర్ 2021
    చివరి తేదీ: 30 డిసెంబర్ 2021
    ఎగ్జామ్​సెంటర్స్​: హైదరాబాద్​, వరంగల్​
    కోర్సు ప్రారంభం: 2023 జనవరి నుంచి ప్రారంభమవుతుంది.
    వెబ్​సైట్: http://www.afcat.cdac.in

ఎగ్జామ్​ ప్యాటర్న్​: వంద మార్కులకు ఆబ్జెక్టివ్​ విధానంలో క్వశ్చన్​ పేపర్​ ఉంటుంది. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌, రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, మిలటరీ ఆప్టిట్యూడ్‌ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. సెక్షన్​ వైజ్​ కట్​ఆఫ్​ ఉండదు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సైకలాజికల్‌ టెస్ట్‌, గ్రూప్​ డిస్కషన్​, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెగెటివ్​ మార్కింగ్​ ఉంటుంది. ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు తొలగిస్తారు.

ట్రైనింగ్​: గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్‌కు 74 వారాలు, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్‌కు 52 వారాల పాటు శిక్షణ ఇస్తారు. ఫ్లయింగ్ ఆఫీసర్​కు లెవల్​ 10 కింద నెలకు రూ.56,100 నుంచి 1,77,500, ఎంఎస్​పీ రూ.15,500, ట్రైనింగ్​ పీరియడ్​లో రూ.56,500 స్టయిఫండ్​ ఇస్తారు.