ఈపీఎఫ్‌ అకౌంట్‌తో రూ.7లక్షల వరకు బెన్‌ఫిట్స్‌ పొందేలా ,పీఎఫ్‌ఓ నియమాలు మారాయని కేంద్రం పేర్కొంది. అదేంటంటే.. ఏ విధమైన ప్రీమియం చెల్లించకుండా 7లక్షలవరకు ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులు పొందటానికి అవకాశం కల్పించామని కేంద్రం పేర్కొంది. ఈపీఎఫ్‌ఓ అధికారికంగా ఎంప్లాయిస్‌ డిపాజిట్‌ లింక్‌డ్‌ ఇన్స్యూరెన్స్‌ స్కీమ్‌ లో భాగంగా 1976 సంవత్సారానికి చెందిన ప్రతి ఒక్క ప్రావిడెంట్‌ ఫండ్‌ లబ్ధి దారులకు రూ.7 లక్షలవరకు ప్రయోజనం కలుగుతుంది.

ఈపీఎఫ్‌ ఖాతాదారుడు చనిపోతే, ఆ ఖాతాదారుడి చట్టపరమైన వారసుడు యొక్క నామినీకి రూ. 7 లక్షల వరకు ప్రయోజనాలు చెల్లించబడతాయి అని ఈపీఎఫ్‌ఓ తెలియజేసింది. అంతే కాకుండా కనీస హామీ ప్రయోజనం కింద ఉద్యోగి మరణించిన తరువాత సంవత్సరం పాటు రూ. 2.5 లక్షలు చెళ్లిస్తామని పేర్కొంది. సభ్యులు ఈపీఎఫ్‌ ​​సభ్యులు లేదా చందాదారులు అయిన తర్వాత ఈడీఎల్‌ఐ స్కీమ్ ప్రయోజనాలకు అర్హులు అని తెలియజేసింది.

ఈడీఎల్‌ఐ స్కీమ్ నామినీ లేదా చట్టపరమైన వారసుడు యొక్క ప్రయోజనాల క్లెయిమ్‌లను పొందడానికి ఫారమ్ 51F నింపి, ఈపీఎఫ్‌ఓకి సమర్పించాల్సి ఉంటుందని, ఈపీఎఫ్‌ ఖాతాదారులు మరణించిన సందర్భంలో ప్రయోజనాలు నేరుగా ఈ బ్యాంక్ ఖాతాకు జమ చేయబడతాయిఅని ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు తెలియజేసింది . అదే విధంగా సభ్యులు ఈపీఎఫ్‌ ​​సభ్యులు లేదా చందాదారులు అయిన తర్వాత ఈడీఎల్‌ఐ స్కీమ్ ప్రయోజనాలకు అర్హులు అని పేర్కొంది.