దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు భారీ లాభాల్లో ముగిసాయి. ఉదయం సెన్సెక్స్‌ 57,125.98 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమై ఇంట్రాడేలో 57,905.63 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరకు 886.51 పాయింట్ల లాభంతో 57,633.65 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 17,044.10 పాయింట్ల వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 17,251.65 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరకు 264.45 పాయింట్లు లాభపడి 17,176.70 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఒక్క ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు మాత్రమే నష్టాల బాట పట్టాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటన్‌, బజాజ్‌ ఫినాన్స్‌, టాటా స్టీల్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్‌, టెక్ మహీంద్రా, టీసీఎస్‌, ఐటీసీ షేర్లు లాభాల్లో ముగిసాయి.