దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 418 పాయింట్ల లాభంతో 57,165 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 126 పాయింట్ల లాభంతో 17,038 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, మారుతీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.