దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 15 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 1,41,986 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 285 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4.8 లక్షలకు చేరింది. గత 24 గంటల్లో 40,895 మంది కొవిడ్ నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3.44 కోట్లు దాటింది. ప్రస్తుతం దేశంలో 4,72,169 క్రియాశీల కేసులున్నాయి.

దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు మొత్తం 3,071గా ఉండగా అందులో 1,203 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. 27 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాతాలకు ఈ వేరియంట్ విస్తరించింది.