భారత్ లో ప్రస్తుతం ప్రభుత్వాలు 15 నుంచి 18 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సిన్‌ ను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌ బయోటెక్‌ కీలక ప్రకటన చేస్తూ కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న చిన్నారులు తరువాత ఎలాంటి మందులు వాడాల్సిన పని లేదని పేర్కొంది. కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం పారాసెట్మాల్, పెయిన్‌ కిల్లర్స్‌ వాడాల్సిన పని లేదని , ఆ మందులు వాడాలని తామేక్కడా సూచనలు చేయలేదని భారత్‌ బయోటెక్‌ కంపెనీ స్పష్టం చేసింది.

కొవాగ్జిన్‌ తీసుకున్న పిల్లలకు 3 పారాసెట్మాల్ 500 ఎంజీ టాబ్లెట్లు ఇస్తున్నట్లు తెలిసిందని అలాంటివి అవసరమే లేదని, 30 వేల మందికి పై తాము క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించామని, అందులో 10 నుంచి 20 శాతం మందికే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చాయని, దీనిపై ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని భారత్‌ బయోటెక్‌ స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ తీసుకున్న పిల్లలకు అస్సలు పెయిన్‌ కిల్లర్లు వేయద్దొని, తమ సూచనలు అమలు చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని స్పష్టం చేసింది.