మైలార్డ్, యువరానర్ అని సంభోదించవద్దు!!

0
1

మైలార్డ్, యువరానర్, అనరబుల్ అనే పదాలను ఉపయోగించవద్దని, కేవలం సర్ అంటే సరిపోతుందని న్యాయవాదులకు, వాదులకు, ప్రతివాదులకు జస్టిస్ మురళీధర్ విజ్ఞప్తి చేశారు. ఆయన తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శి జేకే లెంకా స్వాగతించారు. జడ్జీలు కూడా ఇదే సూత్రాన్ని అనుసరించాలని, విచారణ సందర్భంగా.. తనను మై లార్డ్, యువర్ లార్డ్ షిప్ అని సంబోధించరాదని స్పష్టం చేశారు

కోర్టుల్లో బ్రిటీష్ కాలం నుంచి వస్తున్న పదజాలం నేటికి కంటిన్యూ అవుతోంది. మై లార్డ్ అనే పదం కూడా ఆ కోవలకే వస్తుంది. ఈ విషయంలో ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ ధర్మాసనంలోని జడ్జిలను ఎవరూ ఇకపై ‘మై లార్డ్’, ‘యువర్ లార్డ్ షిప్’, ‘యువరానర్’, లేక ‘ఆనరబుల్’ అనే పదాలను ఉపయోగించవద్దు అని సూచించారు.