కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆప్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్, బెంగళూరు యూనిట్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఉద్యోగ ఖాళీలు 140 ఉన్నాయి. దరఖాస్తుకు చివరి తేదిగా 2022 జనవరి 18 నిర్ణయించారు. దీనిలో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఇంజనీర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్, సీడ్యాక్ అడ్జంక్ట్ ఇంజనీర్ పోస్టులు వేకన్సీ ఉన్నాయి. విద్యార్హతకు సంబంధించి డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంఈ పాసై ఉండాలి. సంబంధిత విభాగంలో ఎక్స్ పీరియన్స్ కలిగి ఉండాలి.

టెక్నికల్ స్టాఫ్ కు 35 ఏళ్లు, సీడ్యాక్ అడ్జంక్ట్ ఇంజనీర్ కు 57 ఏళ్ల వయసు మించకూడదు. ఉద్యోగ ఎంపిక కోసం రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.cdac.in/ వెబ్ సైట్ చూడాలి.