ఆన్​లైన్​లో హయ్యర్​ ఎడ్యుకేషన్​ సర్వీసెస్​ అందిస్తున్న ఎడ్​టెక్​ కంపెనీ అప్​గ్రాడ్​ రెండు కొత్త సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించింది. దీనికోసం ఫుల్‌స్టాక్ అకాడమీ, కాల్‌టెక్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థల భాగస్వామ్యంతో సైబర్‌ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్‌లో షార్ట్​ టర్మ్​ ప్రోగ్రామ్​లను ఆఫర్ చేస్తుంది. ఈ రెండు కొత్త ప్రోగ్రామ్‌లను సబ్జెక్ట్ నాలెడ్జ్​ ఉన్న ప్రొఫెషనల్స్​ కోసం రూపొందించింది. సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ 29 వారాలు, డేటా అనలిటిక్స్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ 36 వారాల వ్యవధి కలిగి ఉంటాయి.

దీని కోసం ఫుల్‌స్టాక్ అకాడమీ, కాల్‌టెక్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థల భాగస్వామ్యంతో సైబర్‌ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్‌లో షార్ట్​ టర్మ్​ ప్రోగ్రామ్​లను ఆఫర్ చేస్తుంది. ఈ రెండు కొత్త ప్రోగ్రామ్‌లను సబ్జెక్ట్ నాలెడ్జ్​ ఉన్న ప్రొఫెషనల్స్​ కోసం రూపొందించింది. సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ 29 వారాలు, డేటా అనలిటిక్స్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ 36 వారాల వ్యవధి కలిగి ఉంటాయి. కోర్సులో భాగంగా నెట్‌వర్కింగ్ సెషన్లు, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, మాక్ ఇంటర్వ్యూ సెషన్లను కూడా నిర్వహిస్తారు. లెర్నర్స్ తమ కెరీర్‌లో ఉత్తమ ఫలితాలను పొందడంలో ఈ కోర్సు సహాయపడుతుందని అప్​గ్రాడ్​ సంస్థ తెలిపింది.

“సైబర్​ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్​ నిపుణులకు మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉంది. ఫ్రెషర్లతో పాటు నిపుణులు సైతం కొత్త టెక్నాలజీలపై పట్టు సాధించేలా కోర్సును రూపొందించాం. ఈ ఆన్​లైన్​ కోర్సు ద్వారా విద్యార్థులు టాప్​ ఎంఎన్​సీ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. వీరికి భారీ వేతనాలు లభిస్తాయి.” అని చెప్పారు. దీనిపై కాల్టెక్ CTME ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రిక్ మాట్లాడుతూ ”అప్‌గ్రాడ్, ఫుల్‌స్టాక్ అకాడమీ భాగస్వామ్యం ద్వారా మా యుఎస్ ఆధారిత ప్రోగ్రామ్‌ను భారతీయ టెక్​ నిపుణులకు చేరువ చేస్తున్నాం. వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ ల్యాండ్‌స్కేప్‌లో నిపుణుల కొరత వేధిస్తోంది. అందువల్ల, నైపుణ్యం సాధించాలని చూస్తున్న విద్యార్థులు, టెక్​ నిపుణులకు ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయి” అని ఫుల్‌స్టాక్ అకాడమీ ప్రెసిడెంట్ జెర్రాడ్ టౌజ్ వివరించారు.