తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ అదనపు కార్యదర్శిగా వి.సర్వేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. దీనిని నిర్ధారిస్తూ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం సర్వేశ్వర్‌రెడ్డి గిరిజన సంక్షేమ శాఖలో అదనపు సంచాలకుడిగా, టీసీఆర్‌టీఐ (గిరిజన సంస్కృతి పరిశోధన, శిక్షణ సంస్థ) సంచాలకుడిగా కొనసాగుతున్నారు. గిరిజన గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శిగా పనిచేసిన నవీన్‌ నికోలస్‌ కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లడంతో మంగళవారం రిలీవ్‌ అయిన నేపథ్యంలో అదనపు కార్యదర్శిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు సర్వేశ్వర్‌రెడ్డికి ప్రభుత్వం అప్పగించింది.