కృష్ణాజిల్లా వీరులపాడు చందర్లపాడు, మండలాలలో తెల్లవారుజామున పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుండి అక్రమంగా మద్యాన్ని పడవల ద్వారా, ద్విచక్రవాహనాల ద్వారా భారీగా మద్యం తెచ్చుకున్న ముఠాను పట్టుకున్న పోలీసులు జిల్లా ఎస్ పి రవీంద్ర బాబు ఆధ్వర్యంలో నందిగామ డిఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సరిహద్దు చెక్పోస్టుల వద్ద, కృష్ణా నది అవతల ఉన్న తెలంగాణ రాష్ట్రం నుండి పడవల ద్వారా మద్యం తీసుకొని వస్తున్నా ముఠాలను పట్టుకున్నమని వారి వద్ద నుండి 3,300 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని 5గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు