వార్తలు (News)

వాట్సాప్‌కు ప్ర‌త్యామ్నాయంగా ప్ర‌భుత్వ యాప్

ప్ర‌ముక మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా ఒక దేశీ యాప్ సిద్ధ‌మైంది. కేంద్ర ప్ర‌భుత్వ‌మే సందేశ్‌ పేరుతో ఒక కొత్త యాప్‌ను రూపొందించింది. ప్ర‌స్తుతం ఈ యాప్ టెస్టింగ్ ద‌శ‌లో ఉంది. అంతేకాదు, కొంతమంది ప్ర‌భుత్వ అధికారులు ఈ యాప్ ప‌నితీరును ప‌రిశీలించ‌డానికి స్వ‌యంగా వాడుతున్నారు. వాట్సాప్‌లో ఉన్న అన్ని ఫీచ‌ర్స్ ఈ సందేశ్ యాప్‌లో ఉండేలా త‌యారుచేసిన‌ట్లు తెలుస్తోంది.

వాట్సాప్‌కు ప్ర‌త్యామ్నాయంగా ఒక దేశీ యాప్‌ను అభివృద్ధి చేస్తున్న‌ట్లు గ‌త సంవ‌త్స‌రం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీనిని గిమ్స్ అని కూడా పిలుస్తున్నారు. గిమ్స్ అంటే గ‌వ‌ర్న‌మెంట్ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ సిస్ట‌మ్‌. ఈ పేరుపైనే ఒక ప్ర‌భుత్వ వెబ్‌సైట్ కూడా ప్ర‌స్తుతం అందుబాటులోకి వ‌చ్చింది.

ప్ర‌భుత్వ ఉద్యోగులు ప్రైవేటు మెసేజింగ్ యాప్‌లు ఎక్కువ‌గా వాడ‌టం మంచిది కాద‌నే ఉద్దేశ్యంతో ప్ర‌భుత్వం వాట్సాప్‌కు ప్ర‌త్యామ్నాయంగా ఈ యాప్‌ను తీసుకువ‌చ్చింద‌ని చెబుతున్నారు. మొద‌ట ఈ యాప్ ప్ర‌భ‌త్వ ఉద్యోగుల‌కే అందుబాటులోకి వ‌చ్చినా, త‌ర్వాత సామాన్య ప్ర‌జ‌లు కూడా వినియోగించుకునే అవ‌కాశం క‌ల్పించనున్న‌ట్లు తెలుస్తోంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.