శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని డిక్యాతలాన్ స్పోర్ట్స్ స్టోర్ రూమ్ కు బాంబు బెదిరింపు కాల్……

• స్టోర్ లో బాంబు పెట్టామంటూ స్టోర్ కు కాల్ చేసిన గుర్తు తెలియని దుండగుడు.

• కోటి రూపాయలు ఇవ్వాలి డిమాండ్
లేకపోతే బాంబును రిమోట్ తో నొక్కి పేలుస్తాంటూ బెదిరింపులు.

• వెంటనే అప్రమత్తం మై స్టోర్ లో వున్న ఉద్యోగులను, కస్టమర్లను బయటకు పంపిన స్టోర్ యాజమాన్యం.

• ఎయిర్ పోర్ట్ పోలీసులకు పిర్యాదు చేసిన యాజమాన్యం. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు బాంబు స్క్వాడ్ బృందం.

• స్టోర్ లో విస్తృతంగా తనిఖీలు చేసిన బాంబ్ స్క్వాడ్ బృందం. బాంబు లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు, స్టోర్ సిబ్బంది.

• కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఎయిర్ పోర్ట్ పోలీసులు. ఫోన్ నెంబర్ ఆధారంగా కాల్ చేసిన పోకిరిని అరెస్టు చేసిన ఎయిర్ పోర్ట్ పోలీసులు.

• పోలీసుల అదుపులో కేటుగాడు. లోతుగా విచారణ చేస్తున్న పోలీసులు.